News August 17, 2024
ప్రిన్స్ వరల్డ్‌గా విశాఖ బాలుడు

థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో అంతర్జాతీయస్థాయి మోడలింగ్ పోటీలు నిర్వహించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విశాఖ బాలుడు కార్తికేయ రెడ్డి సత్తా చాటాడు. ప్రిన్స్ వరల్డ్-2024 టైటిల్ కైవసం చేసుకున్నాడు. గతంలోనూ కాలికట్లో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం.
Similar News
News October 19, 2025
విశాఖ: రేపు కలెక్టరేట్లో PGRS రద్దు

దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం విశాఖ కలెక్టరేట్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదివారం తెలిపారు. అధికారులు ఎవరూ అందుబాటులో ఉండరని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు. వచ్చేవారం యథావిధిగా వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
News October 19, 2025
21న విశాఖ రానున్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి

మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మంగళవారం విశాఖ రానున్నారు. ఆరోజు ఉదయం 4:35 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్‌కి వెళ్తారు. ఉదయం 9:30 గంటలకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం జీవీఎంసీలో జరిగే రివ్యూలో పాల్గొని ఆరోజు సాయంత్రం 7 గంటలకు ట్రైన్లో బయలుదేరి ఒంగోలు వెళ్తారు.
News October 18, 2025
బీచ్‌లో లైట్లు ఏవి..? అధికారులపై మేయర్ ఆగ్రహం

విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు శనివారం రాత్రి ఆర్కే బీచ్ పరిసరాలను పరిశీలించారు. బీచ్‌లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయనందుకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ఆదేశించినా చర్యలు తీసుకోలేదని మేయర్ విమర్శించారు. బీచ్‌లో హైమాస్ట్ లైట్లు వెలగక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే పరిశుభ్రతపై శ్రద్ధ వహించి, బీచ్ అందాన్ని కాపాడాలని సూచించారు.