News September 21, 2024
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం 13 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. జెన్ కో జలవిద్యుత్ కేంద్రంలో ఉదయం నాలుగు యూనిట్లలో విద్యుదుత్పత్తి చేయగా రాత్రి రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేశారు. విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 7,849 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 95 క్యూసెక్కులు ఇలా ప్రాజెక్టు నుంచి మొత్తం 11,654 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Similar News
News October 16, 2025
మహబూబ్‌నగర్: కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్క నాటిన గవర్నర్

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఈరోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.
కలెక్టరేట్ ప్రాంగణంలో గవర్నర్ మొక్క నాటి, నీళ్లు పోశారు. ఈ సమావేశంలో టీబీ నియంత్రణ చర్యలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయం వంటి ముఖ్య అంశాలపై చర్చించారు.
News October 16, 2025
కురుమూర్తి బ్రహ్మోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

చిన్నచింతకుంట మండలం అమ్మాపురం శివారులోని శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ మేరకు శ్రీ కురుమూర్తి దేవస్థాన ఛైర్మన్ జి.గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేకు ఆహ్వన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
పాలమూరు యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్

పాలమూరు యూనివర్సిటీలో గురువారం నిర్వహించిన 4వ కాన్వకేషన్ (స్నాతకోత్సవం) కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ జానకి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, వీసీ శ్రీనివాస్ ఉన్నారు.