News November 29, 2024

ప్రియాంక గాంధీని కలిసిన జహీరాబాద్ ఎంపీ

image

వయునాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రియాంక గాంధీని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు.

Similar News

News November 30, 2024

సంగారెడ్డి: డిసెంబర్ 4న ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ

image

సంగారెడ్డి కలెక్టరేట్లో డిసెంబర్ 4న ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ షమీమ్ అత్తర్ బహిరంగ విచారణకు హాజరవుతారని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఎస్సీ కుల సంఘాల నాయకులు బహిరంగ విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

News November 29, 2024

సిద్దిపేటలో రేవంత్‌ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

image

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్‌ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.

News November 29, 2024

REWIND: కేసీఆర్ అరెస్ట్.. ఆ తర్వాత పరిణామాలు

image

తెలంగాణ కోసం 2009 NOV29న దీక్ష చేపట్టిన KCR.. సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఈ క్రమంలో దీక్షా స్థలంలో అలజడి మొదలు కాగా వెంటనే హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి, సోలిపేట ఇతర నాయకులు దీక్ష చేపట్టారు. సిద్దిపేట, రంగధాంపల్లి దీక్షలు యావత్ తెలంగాణను కదిలించాయి. సిద్దిపేట, పాలమూకుల దీక్షలు ఏకంగా 1,531 రోజులపాటు కొనసాగాయి.