News October 10, 2024
ప్రియుడిపై కోపంతో కళ్లీ పాలు తాగిన యువతి
ప్రియుడు మరొకరితో చనువుగా ఉండటం జీర్ణించుకోలేక ఓ యువతి కళ్లీ పాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన(21) ఏళ్ల యువతి ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ అక్కడ ఉన్న ఓ యువకుని ప్రేమలో పడింది. కొంతకాలం ఇద్దరూ చనువుగా ఉన్నారు. తనను కాదని అదే షాపులో పనిచేసే మరో యువతిని తన ప్రియుడు ప్రేమిస్తున్నాడని కళ్లీ పాలు తాగింది.
Similar News
News November 11, 2024
మదనపల్లె పూర్వ RDO అక్రమ ఆస్తులు రూ.230 కోట్లు!
మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.
News November 11, 2024
తిరుపతిలో దొంగనోట్లు ఎలా తయారు చేశారంటే..?
తిరుపతి జిల్లాలో <<14578425>>దొంగనోట్ల <<>>ముఠా పట్టుబడిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుకు తిరుపతికి చెందిన రమేశ్ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయ్యారు. చెర్లోపల్లి సర్కిల్ వద్ద ఉన్న రమేశ్ ఇంట్లో ఉంటూ షేర్ మార్కెట్ బిజినెస్ చేయగా నష్టపోయారు. దీంతో యూట్యూబ్ చూసి దొంగ నోట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. తిరుపతి, పుత్తూరు, శ్రీకాళహస్తిలో ఈ దందా నడిపారు. చివరకు పోలీసులకు చిక్కారు.
News November 11, 2024
మదనపల్లె: మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండపైకి సోమవారం 2 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మదనపల్లె-1 డిపో మేనేజర్ మూరె వెంకటరమణ రెడ్డి తెలిపారు. మదనపల్లె బస్టాండు నుంచి ఉదయం 5 గంటలకు మొదటి బస్సు, 6:30కి రెండో బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ప్రయాణికులు, భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.