News April 14, 2025

ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర..!

image

వివాహేతర సంబంధంతో ప్రియురాలి భర్తను హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖానాపురం హవేలీ సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన కథనం ప్రకారం.. ముదిగొండ (మం) సువర్ణపురంకు చెందిన ధర్మ భార్యతో.. రామాంజనేయులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఎలాగైనా ప్రియురాలి భర్త(ధర్మ)ను అడ్డు తొలగించాలని తన స్నేహితులతో కుట్ర చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

Similar News

News November 23, 2025

భారీ జీతంతో SIDBIలో ఉద్యోగాలు

image

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<>SIDBI<<>>) 14 కన్సల్టెంట్ క్రెడిట్ అనలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు DEC 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA, CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.లక్ష చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.sidbi.in/

News November 23, 2025

రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జనగామ కలెక్టర్

image

కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు రద్దు చేస్తున్నట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాష షేక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో, అలాగే స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు విధి నిర్వహణలో ఉన్నందున రేపటి గ్రీవెన్స్ సెల్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

News November 23, 2025

‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ ఎలా ఉందంటే?

image

OTTలో ట్రెండింగ్ వెబ్ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నుంచి మూడో సీజన్ విడుదలైంది. ఈశాన్య భారతంలో నడిచే కథతో దర్శకులు రాజ్, డీకే కొత్త ప్రపంచానికి తీసుకెళ్లారు. మనోజ్ బాజ్‌పాయ్ నటన, విజయ్ సేతుపతి క్యామియో, కొత్త పాత్రల్లో జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ అదరగొట్టారు. గత సీజన్లతో పోలిస్తే యాక్షన్ తక్కువగా ఉండటం, బలమైన కథ లేకపోవడం నిరాశపరుస్తాయి. చివర్లో సీజన్ 4 ఉందని హింట్ ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది?