News December 14, 2024
ప్రేమవ్యవహారం.. కొలిమిగుండ్ల బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు చెందిన బీటెక్ విద్యార్థి శ్రీ హర్ష (20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ రమేశ్ బాబు వివరాల మేరకు.. శ్రీ హర్ష గుజరాత్‌లోని వొడదొరలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. తన కొడుకు బలవన్మరణానికి ప్రేమవ్యవహారమే కారణమని తండ్రి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వివరించారు.
Similar News
News January 17, 2025
దేహదాధారుఢ్య పరీక్షల్లో 323 మంది ఎంపిక
పోలీసు నియామక పక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు APSP 2వ బెటాలియన్‌లో 8వ రోజు దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో జరిగిన పరీక్షలకు 600 మంది అభ్యర్థులను పిలవగా.. 323 మంది అభ్యర్ధులు బయోమెట్రిక్‌కు హజరయ్యారు.
News January 17, 2025
BREAKING: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాలకుర్తి వద్ద లారీ టైర్ పేలి కారుపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు కోడుమూరు వాసులుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 17, 2025
కర్నూలుకు పెట్టుబడుల క్యూ.. కారణమిదే!
☞ ఓర్వకల్లు విమానాశ్రయం ఉండటం
☞ ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో అందుబాటులో భూమి
☞ హైదరాబాద్- బెంగళూరు నగరాలకు మెరుగైన రవాణా సౌకర్యం
☞ సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం
☞ నీటి వనరుల అనుకూలం
☞ సంస్థలకు త్వరితగతిన అనుమతులు
☞ ఓర్వకల్లు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకునే అవకాశం
☞ కర్నూలు ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ <<15167493>>మంత్రిగా<<>> ఉండటం