News February 14, 2025
ప్రేమికులు తస్మాత్ జాగ్రత్త: బజరంగదళ్

వాలంటైన్స్ డే పేరు చెప్పుకొని విచ్చలవిడిగా తిరిగే ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలని గుంటూరు జిల్లా బజరంగదళ్ నాయకులు హెచ్చరించారు. ఫిబ్రవరి 14 అంటే పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో మన జవాన్లు దారుణంగా మృతిచెందిన రోజని చెప్పారు. ఇది సంతాపదినమే కానీ ప్రేమికుల దినోత్సవం కాదన్నారు. విచ్చలవిడితనానికి, లవ్ జిహాదీకి తాము వ్యతిరేకమని, ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణగా ఉంటామన్నారు.
Similar News
News March 27, 2025
గుంటూరు జిల్లాలో గెలిచిన వారి వివరాలు

గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికలు ముగిశాయి. పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు (TDP) ఉప సర్పంచ్‌గా నాగమల్లేశ్వరరావు గెలుపొందారు. గుంటూరు రూరల్ మండల ఉపాధ్యకుడిగా కాకాని రమేష్(YCP), దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్షురాలిగా షేక్ జబీన్(TDP), తెనాలి కోఆప్షన్ సభ్యుడిగా సయ్యద్ జానీ బాషా(YCP), కొల్లిపర మండలం (YCP) తూములూరు ఉప సర్పంచ్‌గా ఆరుమళ్ల శివారెడ్డి ఎన్నికయ్యారు.
News March 27, 2025
గుంటూరు: సీఎం చంద్రబాబుకు నాదెండ్ల స్వాగతం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గురువారం పరిశీలన చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ పోలవరం చేరుకుని ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మంత్రి నాదెండ్ల ప్రాజెక్టు గురించి పలు విషయాలు వివరించారు. అనంతరం నిర్వాశితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.
News March 27, 2025
ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ మంత్రి విడదల రజిని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఏప్రిల్ 2వ తేదీకి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈ మేరకు గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. కాగా ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌కు మాజీ మంత్రి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.