News August 12, 2024
ప్రేమిస్తున్నానని వేధింపులు.. యువకుడిపై కేసు

ప్రేమిస్తున్నానని వెంటపడుతూ.. ఒప్పుకోకపోతే చనిపోతా, ఫొటోలు నెట్‌లో పెడతానంటూ యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. చేబ్రోలుకు చెందిన యువకుడిపై గొల్లప్రోలు యువతి ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని SI జాన్ బాషా తెలిపారు. కాలేజీకి వచ్చి యువకుడు బెదిరించడంతో పాటు గతంలో అతడితో తీసుకున్న ఫొటోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 16, 2025
17న యథావిధిగా ‘పీజీఆర్ఎస్’: కలెక్టర్ కీర్తి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పీజీఆర్ఎస్ (PGRS) కార్యక్రమం ఈ నెల 17న యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజలు తమ అర్జీలను డివిజన్, మండల, సచివాలయ కార్యాలయాల్లో సమర్పించవచ్చని సూచించారు. నేరుగా రాలేని వారు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అక్కడే తమ ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చని కలెక్టర్ శనివారం పేర్కొన్నారు.
News November 15, 2025
తూ.గో: 48 గంటల్లో రూ.56.84 కోట్ల జమ

తూ.గో జిల్లా ధాన్యం సేకరణ అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించినట్లు జేసీ వై.మేఘ స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుతానికి 5,890 ధాన్యం కొనుగోలు కూపన్లు జనరేట్ చేశామన్నారు. 16 మండలాల్లో 122 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 3,695 మంది రైతుల నుంచి 27,616.360 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే 3,191 మంది రైతులకు రూ. 56.84 కోట్లు జమ చేశామని తెలిపారు.
News November 15, 2025
తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.


