News December 2, 2024

ప్రేమ పేరుతో మోసం.. ఆదోనిలో ప్రియుడి కుటుంబంపై కేసు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఆదోనిలో కేసు నమోదైంది. సీఐ శ్రీరామ్ వివరాల మేరకు.. ఆదోనికి చెందిన గురుప్రసాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. మైసూరు యువతి చందన పరిచయమైంది. ఇరువురూ ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులతో చర్చల తర్వాత యువకుడు పెళ్లికి నిరాకరించారు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడితోపాటు కుటుంబ సభ్యులపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Similar News

News April 13, 2026

కర్నూలు: పోలీస్ PGRSకి 1122 అర్జీలు

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో బాధితుల నుంచి SP విక్రాంత్ పాటిల్ స్వయంగా వినతులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 112 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక మోసాలు, బెదిరింపులు, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తదితరులు పాల్గొన్నారు.

News April 13, 2026

అర్జీలకు వెంటనే పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులు ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తమ దృష్టికి వచ్చిన అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. నిర్ణీత గడువులోగానే సమస్యలకు పరిష్కారం చూపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె ఆదేశించారు.

News April 13, 2026

కర్నూలు రేంజ్‌లో 25 మంది సీఐల బదిలీ

image

కర్నూలు రేంజ్ పరిధిలో భారీగా పోలీసు అధికారుల స్థానచలనం జరిగింది. పరిపాలన కారణాలతో 25 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఈ పోస్టింగ్‌లు ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు కొందరిని వీఆర్‌కు పంపారు. బదిలీ అయిన అధికారులు వెంటనే స్పందించి బాధ్యతలు స్వీకరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.