News August 23, 2024

ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు

image

బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు వేమూరు ఎస్సై రవికృష్ణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. వేమూరు మండలం ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు కొన్ని నెలల క్రితం ఆదే గ్రామానికే చెందిన నాగచైతన్య ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. బాలిక గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరింది. అందుకు అతను నిరాకరించడంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది.

Similar News

News September 19, 2024

అమరావతి: పాఠశాలలకు దసరా సెలవులు ఎప్పటినుంచి అంటే?

image

రాష్ట్రంలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

News September 19, 2024

గుంటూరు: మాది మంచి ప్రభుత్వం: సీఎం

image

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని గురువారం సీఎం చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తున్నదన్నారు. 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమ పథకాలు అమలు చేసిన మంచి ప్రభుత్వం అన్నారు.

News September 19, 2024

నందిగం సురేశ్‌కు రిమాండ్ పొడిగింపు

image

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో 14 రోజులు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా TDP కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 5న సురేశ్‌ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేయగా, ఆయనను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ కూడా జరిపారు. బుధవారం తుళ్లూరు పోలీసులు ఓ మర్డర్ కేసులో ఆయనపై పీటీ వారెంట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.