News February 19, 2025
ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

ప్రేమ పేరుతో లోబరుచుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన యువకుడిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన యువతిని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.
Similar News
News October 19, 2025
దీపావళి శాంతియుతంగా జరుపుకోండి: ADB కలెక్టర్

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 19, 2025
ADB: చివరి రెండు రోజులు పోటెత్తారు!

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో ఈసారి 711 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో 1047 వచ్చినా, ఫీజు పెంపుతో ప్రభుత్వానికి రూ.21.33 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే రూ.39లక్షలు ఎక్కువ. ఉట్నూర్ ఎసైజ్ స్టేషన్ పరిధిలో 39వ షాపునకు అత్యధికంగా 25 దరఖాస్తులు వచ్చాయి. 9 షాపులకు రీ-టెండర్ అవకాశం ఉండగా, 3రోజుల క్రితం100లోపే దరఖాస్తులుండగా.. చివరి 2 రోజుల్లో భారీగా వచ్చాయి.
News October 19, 2025
‘పది’లో ఆదిలాబాద్ ప్రత్యేకంగా నిలిచేలా

గతేడాది పదో తరగతిలో జిల్లా 97.95% ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే తరహాలో మరింత పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లాలోని 130 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6,354 మంది విద్యార్థులకు ఇప్పటికే అభ్యసన దీపికలు, పోషకాలతో కూడిన బ్రెడ్ అందిస్తున్నారు. రోజూ సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి.