News February 19, 2025

ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు

image

ప్రేమ పేరుతో లోబరుచుకొని తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేసిన యువకుడిపై బోథ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన యువతిని నారాయణపూర్ గ్రామానికి చెందిన జాదవ్ నవీన్ ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోమని ఆ యువతి ఒత్తిడి తేవడంతో నిరాకరించాడు. దీంతో అతనిపై అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.

Similar News

News April 10, 2026

ADB: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

image

ADB జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లోని ఈవీఎం భద్రతా కేంద్రాన్ని (గోదాం) జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News April 10, 2026

ADB: టోల్‌ ప్లాజాలో నగదు చెల్లింపులు బంద్

image

నేటి నుంచి టోల్‌ ప్లాజాల్లో నగదు చెల్లింపులను అధికారులు నిలిపివేశారు. కేవలం ఫాస్టాగ్‌ లేదా యూపీఐ ద్వారానే రుసుము స్వీకరించనున్నారు. నిబంధన ఉల్లంఘించి నగదు ఇచ్చేవారు 1.25 రెట్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని రోలమామడ, గంజాల్‌ టోల్‌ ప్లాజాల వద్ద ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాహనదారులు ఇబ్బందులు పడకుండా ముందుగానే ఫాస్టాగ్‌ రీఛార్జ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 10, 2026

ఆదిలాబాద్: వాట్సాప్‌లో ఓపెన్‌ స్కూల్‌ హాల్‌టికెట్లు

image

ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షల హాల్‌టికెట్లను ఈసారి సులభంగా వాట్సాప్ ద్వారా పొందే వెసులుబాటు కల్పించినట్లు DEO రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థులు 8096958096 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, ‘HAI’ అని మెసేజ్ పంపడం ద్వారా ఈ సేవను పొందవచ్చు. అక్కడ కనిపించే ఆప్షన్లలో పదో తరగతి లేదా ఇంటర్ థియరీని ఎంచుకుని, అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేస్తే హాల్‌టికెట్ డౌన్‌లోడ్ అవుతుందని ఆయన వివరించారు.