News April 25, 2025

ప్రేమ పేరుతో మోసం.. పోక్సో కేసు నమోదు: SI

image

పిచ్చాటూరు మండలంలో ఓ యువకుడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశులు తెలిపారు. SSBపేటకు చెందిన నిందితుడు పార్థిబన్(25) ఓ బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 5, 2026

పార్వతీపురం: ‘ప్రతి ఫిర్యాదుకు నాణ్యమైన పరిష్కారం చూపడమే లక్ష్యం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో తాజాగా నిర్వహించిన వారాంతపు నివేదికల సమీక్షా సమావేశంలో వివిధ శాఖల పనితీరును విశ్లేషించారు.ప్రజల నుంచి సేకరించిన ప్రతి అర్జీని, అదే వారం శనివారం సాయంత్రానికి కచ్చితంగా పూర్తి చేయాలని అధికారులు గడువు విధించారు.

News January 5, 2026

మళ్లీ పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18766451>>మళ్లీ<<>> పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ మొత్తం రూ.2,020 పెరిగి రూ.1,37,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,850 ఎగబాకి రూ.1,26,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.8వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 5, 2026

ఇరుసుమండ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా!

image

ఇరుసుమండలో ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. దీనిపై కలెక్టర్‌, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ కు సూచించారు. లీక్ ను నియంత్రించాలన్నారు.