News August 30, 2024
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువకుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలానికి చెందిన రవికుమార్ తనను మోసం చేశాడని ప.గో జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్కు చెందిన యువతి ఫిర్యాదు చేసినట్లు నరసాపురం రూరల్ SI సురేశ్ తెలిపారు. దీంతో రవికుమార్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News January 6, 2026
జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్గా సుబ్బారాయుడు

తూ.గో. జిల్లా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్గా బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు నియమితులయ్యారు. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడైన ఆయన, 2026 నుంచి 2029 వరకు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు రాజా, కార్యదర్శి శ్రీనివాస్ ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.
News January 6, 2026
రెండేళ్ల నిరీక్షణకు ఫలితం.. బాధితురాలి ఖాతాలో పెన్షన్ సొమ్ము జమ!

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జోక్యంతో పి.పద్మావతి అనే బాధితురాలికి న్యాయం చేకూరింది. ఆమెకు రావాల్సిన రూ.11,09,637 పెన్షన్ బకాయిలు ఈనెల 2న బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. అలాగే నెలకు రూ.14 వేల పింఛను మంజూరైంది. 2022లో ఆమె దాఖలు చేసిన అర్జీపై స్పందించి పరిష్కరించినందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంథం సునీత, కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మిలకు పద్మావతి కృతజ్ఞతలు తెలిపారు.
News January 6, 2026
రాజానగరం: తొలిసారిగా ‘నన్నయ వర్సిటీ’కి ఫైవ్ స్టార్ గౌరవం

ఉన్నత విద్యారంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి ప్రతిష్టాత్మకమైన ‘ఫైవ్ స్టార్ క్వాలిటీ రేటింగ్’ సర్టిఫికెట్ లభించింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా నన్నయ వర్సిటీ ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకోవడం విశేషం. మంగళవారం అమరావతిలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఈ సర్టిఫికెట్ను వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు.


