News January 20, 2025

ప్రేమ పేరుతో లెక్చరర్ మోసం.. ఆదోని సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు

image

తనను ప్రేమ పేరుతో నమ్మించి ఓ లెక్చరర్ మోసం చేశాడని ఓ యువతి సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కౌతాళం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఆయన 2023-24 సంవత్సరంలో ప్రేమిస్తున్నారని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని తెలిపారు. అప్పటి నుంచి ఇరువురం ప్రేమలో ఉన్నామని పేర్కొన్నారు. తాజాగా ఇష్టం లేదంటూ పెళ్లికి నిరాకరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు.

Similar News

News January 20, 2025

కర్నూలు జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

image

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ బదిలీ అయ్యారు. నూతన ఎస్పీగా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్వరలో కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా విక్రాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు. బిందుమాధవ్ కాకినాడ ఎస్పీగా నియమితులయ్యారు.

News January 20, 2025

ఆళ్లగడ్డ హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష

image

ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కోర్టు తీర్పు వెల్లడించింది. మహమ్మద్ రఫీ అలియాస్ పెద్దలాలు అనే వ్యక్తిపై నేరం రుజువు కావడంతో ఆళ్లగడ్డ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శైలజ ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసులో విచారణ అధికారిగా ప్రీతం రెడ్డి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణారెడ్డి, శివప్రసాదరావులు తమ వాదనలు వినిపించారు.

News January 20, 2025

కొత్తపల్లి: బయల్పడుతున్న సంగమేశ్వరాలయం

image

కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్త నదుల సంఘం క్షేత్రంలోని సంగమేశ్వరాలయం నెమ్మదిగా బయలు పడుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 855.90 అడుగుల మేర నీటి నిల్వలు ఉండడంతో ఆలయం పది అడుగుల మేర బయల్పడింది. మరో 18 అడుగులు తగ్గినట్లయితే ఆలయం పూర్తిస్థాయిలో బయలు పడనుంది. జులై నెలలో నీటి మునిగిన సంగమేశ్వరుడు నెమ్మదిగా జలాధివాసం నుంచి విముక్తి పొందుతున్నారు.