News March 27, 2025

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో బోధన: VKB కలెక్టర్

image

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల బోధన చేసి పిల్లలు ఆంగ్లంలో ధారాళంగా మాట్లాడటం హర్షించదగిన విషయమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో యంగ్ ఓరేటర్స్ క్లబ్, బొస్చ్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో విద్యా కదంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన చేస్తున్నారని వివరించారు.

Similar News

News October 16, 2025

తెనాలి: ఆధిపత్య పోరుతో అన్యాయంగా చంపేశారు..?

image

అమృతలూరు(M) కోరుతాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావు@ బుజ్జి తెనాలిలో మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సంచలనం రేకెత్తించిన హత్య కేసును పోలీసులు ఛేదించినట్టు తెలుస్తోంది.గ్రామంలోని రామాలయం విషయంలో ఆధిపత్య పోరుతో సమీప బంధువే ఈ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలతో నిందితుడిని గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది

News October 16, 2025

సంగారెడ్డి: ‘ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

image

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నవంబర్ 15 వరకు పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. గోజాతి, గేదె జాతి పశువుల రైతులు టీకాలు వేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News October 16, 2025

నేడు శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్న ప్రధాని

image

నేడు శ్రీశైలం మల్లన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకోనున్నారు. ఉదయం 11:15 ని శ్రీశైలంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలం వెళ్లే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు సహకరించాలని కోరారు.