News April 9, 2025

ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు: స్పీకర్ అయ్యన్న

image

ప్రసవం కోసం పీ.హెచ్.సీలకు వస్తున్న కేసులను ఆశ కార్యకర్తలు నర్సీపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి కమిషన్లు పొందుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ విజయకృష్ణన్ సమక్షంలో నిర్వహించారు. వివిధ పీహెచ్సీల నుంచి 2023-24లో 398, 2024-25లో 498 ప్రసూతి కేసులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారని వెల్లడించారు.

Similar News

News December 9, 2025

మెదక్: సర్పంచ్ బరిలో జర్నలిస్టులు

image

పంచాయతీ ఎన్నికల్లో జర్నలిస్టులు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తాము గెలుపొంది ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు. మెదక్ జిల్లాలో మక్తభూపతిపూర్ (సిహెచ్. అశోక్), బూర్గుపల్లి (సాయిలు), కల్వకుంట (రంగా రాజకిషన్), చంద్లాపూర్ (కృష్ణాగౌడ్), చందంపేట (నాయిని ప్రవీణ్), పొడ్చన్‌పల్లి(భూమయ్య)ల్లో జర్నలిస్టులు సర్పంచ్ బరిలో నిలిచారు.

News December 9, 2025

రాయ్‌బరేలిలో ‘ఓట్ చోరీ’తో గెలిచిన ఇందిరా గాంధీ: బీజేపీ MP

image

భారత రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అవమానించిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె విమర్శించారు. రాయ్‌బరేలిలో ఇందిరా గాంధీ ‘ఓట్ చోరీ’తోనే గెలిచారని ఆరోపించారు. తాను RSS నుంచి వచ్చినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. లోక్‌సభలో ఎలక్షన్ రిఫామ్స్‌పై జరుగుతున్న చర్చలో RSS, ‘ఓట్ చోరీ’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను దూబె తిప్పికొట్టారు.

News December 9, 2025

1500 మందితో 5 అంచెల భద్రత: సూర్యాపేట ఎస్పీ

image

మొదటి విడత ఎన్నికలు జరగనున్న 8మండలాల్లో మంగళవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగిసిందని ఎస్పీ నరసింహా తెలిపారు. 1500 మంది సిబ్బందితో 5 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్లకు ప్రలోభాలు, తప్పుడు సమాచారం, సోషల మీడియా దుర్వినియోగం, గుంపులుగా చెరడం నిషేధమని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు నిషేధం. సమస్యాత్మక గ్రామాలపై నిఘా పెంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.