News April 9, 2025

ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారు: స్పీకర్ అయ్యన్న

image

ప్రసవం కోసం పీ.హెచ్.సీలకు వస్తున్న కేసులను ఆశ కార్యకర్తలు నర్సీపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి కమిషన్లు పొందుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. మంగళవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ విజయకృష్ణన్ సమక్షంలో నిర్వహించారు. వివిధ పీహెచ్సీల నుంచి 2023-24లో 398, 2024-25లో 498 ప్రసూతి కేసులను ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారని వెల్లడించారు.

Similar News

News April 22, 2025

బాబా ఉత్సవాలకు ముందస్తు ప్రణాళికలు చేపట్టాలి: కలెక్టర్

image

సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగే కార్యక్రమాలను జిల్లా ప్రభుత్వం యంత్రాంగం తరఫున ముందస్తు ప్రణాళికను చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 23న బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రానున్నారన్నారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

News April 22, 2025

జలుమూరు: నాడు IPS.. నేడు IAS

image

జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేశ్ 2023 సర్వీసెస్ ఫలితాలలో 467 ర్యాంక్ సాధించి IPSకు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. అయితే IAS కావాలనే సంకల్పంతో వెంకటేశ్ మళ్లీ సివిల్స్ పరీక్షలు రాశాడు. మంగళవారం విడుదలైన సర్వీసెస్ ఫలితాలలో 15వ ర్యాంక్‌తో ఐఏఎస్ సాధించాడు. దీంతో వెంకటేశ్ తల్లిదండ్రులు చందర్రావు, రోహిణి అనందం వ్యక్తం చేశారు. వెంకటేశ్‌ని పలువురు అభినందించారు.

News April 22, 2025

ప్రతి వాహనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి:  ADB SP

image

ప్రతి వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు అధికారుల వాహనాల డ్రైవర్లకు శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ప్రతి వాహనంలో కెమెరాలు చేశామన్నారు. వాటిని సరైన విధంగా పద్ధతిలో ఉంచుకోవాలని తెలియజేశారు.

error: Content is protected !!