News September 6, 2024
ప్రైవేట్ ఆస్పత్రుళ్లుగా ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు: దమోదర్ రాజనర్సింహ

ప్రైవేట్ హాస్పిటళ్లకు దీటుగా ప్రభుత్వ హాస్పిటళ్లును అభివృద్ధి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నూతనంగా రూ.121 కోట్లతో నిర్మించనున్న హాస్టల్ భవనాల నిర్మాణానికి మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా వైద్యారోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన 282మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
Similar News
News February 25, 2026
HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.
News February 25, 2026
HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
News February 25, 2026
HYD: అమ్మాయిలూ ఇది మిస్ అవ్వకండి

మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. కరోనా టీకా తరహాలో ఫ్రీ వ్యాక్సిన్‌ను నిర్ణయించింది. త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా.. ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మంది ఉంటారని తెలంగాణ వైద్యారోగ్యశాఖ అంచనా. సమీప PHCల్లో 6 నెలల వ్యవధిలో 3 టీకాలు ఉచితంగా అందించనున్నారు.


