News April 20, 2025

ప్రైవేట్ స్కూల్లో ప్రవేశం పొందవచ్చు: అల్లూరి డీఈవో

image

అభాగ్యులు, అనాధ పిల్లలు ఇకపై నేరుగా మీకు దగ్గరలో గల ఏ ప్రైవేట్ పాఠశాలలో (cbse, స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ) అయినా 1వ తరగతిలో ప్రవేశం పొందవచ్చని అల్లూరి DEO బ్రహ్మాజీరావు ఆదివారం తెలిపారు. ఈ మేరకు 25% కోటా కేటాయించాలని అన్ని ప్రైవేట్ స్కూల్స్‌కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈనెల 28 నుంచి మే 15 తేదీలోగా https://cse.ap.gov.in ద్వారా online దరఖాస్తు చేసుకొని బడిలో చేరాలన్నారు.

Similar News

News April 20, 2025

విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు: కేశినేని చిన్ని

image

AP: మహిళా ప్రపంచకప్ క్రికెట్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడ మూలపాడులో జర్నలిస్టుల క్రికెట్ పోటీల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విశాఖలో మరిన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు జై షా అంగీకరించినట్లు వెల్లడించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.

News April 20, 2025

రోహిత్ రికార్డును సమం చేసిన కోహ్లీ

image

ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న భారత ప్లేయర్‌గా రోహిత్ రికార్డును కోహ్లీ సమం చేశారు. ఇవాళ పంజాబ్‌తో మ్యాచులో అర్ధసెంచరీతో అదరగొట్టిన కోహ్లీ 19వ POTM అందుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో ధోనీ(18 POTM) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ మెగా టోర్నీలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా డివిలియర్స్(25) తొలి స్థానంలో ఉన్నారు.

News April 20, 2025

నంద్యాల జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

∆శ్రీశైలంలో కర్ణాటక బస్సుకు తప్పిన పెను ప్రమాదం
∆ఆత్మకూరులో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
∆నిరుపేదలకు వైద్యం అందించాలనేది లక్ష్యం: MP
∆డోన్‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా
∆నరసింహ స్వామి ఆలయంలో మంత్రి బీసీ ప్రత్యేక పూజలు
∆హోటల్ యజమానులకు ఆళ్లగడ్డ సీఐ హెచ్చరికలు
∆ఆత్మకూరులో రోడ్లపైనే నిలిచిన నీరు

error: Content is protected !!