News September 8, 2024
ప్రొద్దుటూరులో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. అండర్-18, 20, 23 మహిళలకు, పురుషులకు పరుగు పోటీలు, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా తెలిపారు.
Similar News
News October 9, 2024
కడప జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు
వైఎస్సార్ జిల్లాలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ శివశంకర్ కన్నెర్ర చేశారు. జిల్లా వ్యాప్తంగా 57 అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ముద్దనూరులో 53, జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో 4 అక్రమంగా చేయగా.. వీటిని ముద్దనూరు ఇన్‌ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో గుర్తించామన్నారు.
News October 9, 2024
గొప్ప మనసును చాటుకున్న కడప జిల్లా కలెక్టర్
ఫిర్యాదుల పట్ల తక్షణ సహాయ సహకారాలు అందిస్తూ కడప కలెక్టర్ శివశంకర్ గొప్ప మనసును చాటుకుంటున్నారు. దువ్వూరు మండలం క్రిష్ణంపల్లికి చెందిన పి. భాగ్యలక్ష్మి తాను ఒంటరి మహిళనని, తనకు సపరేటుగా రేషన్ కార్డు సదుపాయం కల్పించాలని, రేషన్ కోటా తీసుకోలేక పోతున్నానని కలెక్టర్‌కు విన్నవించారు. రేషన్ కార్డు సపరేషన్ ఆప్షన్ లేదని, అంతవరకు తన సొంత ఖర్చుతో బియ్యం, సరుకులు అందిస్తామని చెప్పి వెంటనే ఆమెకు అందించారు.
News October 9, 2024
కాక పుట్టిస్తున్న జమ్మలమడుగు రాజకీయం
రెండు రోజుల నుంచి జమ్మలమడుగు రాజకీయం వేడి వాడిగా సాగుతోంది. సుధీర్ రెడ్డి వైడ్ బాల్, MLC రామసుబ్బారెడ్డి నో బాల్ అని MLA ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు. దీనికి ఎమ్మెల్యే ఆది అధికారం ఉంటేనే పులి, అధికారం లేకపోతే పిల్లిలా ఉంటాడంటూ రామసుబ్బారెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. వీళ్ల వ్యాఖ్యలు చూస్తుంటే 2009 ఎన్నికలు గుర్తుకువస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. వీళ్ల వ్యాఖ్యలపై మీ కామెంట్..