News February 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,400
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,168
* 10 గ్రాముల వెండి ధర రూ.2,438.

Similar News

News March 17, 2026

30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

image

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్‌ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.

News March 17, 2026

కడప: రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యుల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. బుధవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు కొనసాగనున్నాయి. కడప నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా జిల్లా జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టనున్నారు.

News March 17, 2026

కడప: నేటి ఇంటర్ పరీక్షలకు 12,781 మంది విద్యార్థులు హాజరు.!

image

కడప జిల్లాలో మంగళవారం 60 సెంటర్లలో ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. నేటి పరీక్షలకు 13,156 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 12,781 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారు. 375 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు.