News March 23, 2024
ప్రొద్దుటూరులో వ్యక్తి ఆత్మహత్య
కర్నూలుకు చెందిన రాజశేఖర్ శర్మ అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అదే జిల్లాలోని గోనెగండ్ల మండలంలో ఆయన పని చేసేవాడు. ఇటీవలె ఆయన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్థాపానికి గురై రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు. ఓ లాడ్జిని అద్దెకు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 12, 2024
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు: కడప కలెక్టర్
ఆధార్ నమోదు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన మేరకే సర్వీసు ఛార్జీలను చెల్లించాలని, అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటన ద్వారా ప్రజలకు సూచించారు. జిల్లాలో ఆధార్ సేవల నిర్వహణపై సోమవారం జేసీ అదితి సింగ్, ఆర్డీవోలు జిల్లాలోని పలు ఆధార్ సేవ కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆధార్ సేవాకేంద్రాల్లో సేవలు అందించాలన్నారు.
News November 11, 2024
వెంపల్లె: ఓ వ్యక్తిపై రాళ్లు, రాడ్లతో దాడి
వెంపల్లెలో సోమవారం రాత్రి కొందరు రెచ్చిపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంపల్లిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో వెంపల్లెలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
News November 11, 2024
కడప: నదిలో దిగి.. వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి
కడప జిల్లాలో వేర్వేరు చోట్ల నదిలో దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నూరు మండలం వాటర్ గండి వద్ద పెన్నా నదిలో పడి కడపకు చెందిన బిల్లపాటి బాబు మృతి చెందినట్లు CI పురుషోత్తమరాజు తెలిపారు. CKదిన్నె మండలం బుగ్గవంక డ్యామ్‌లో చేపల వేటకు వెళ్లి ఇప్పెంట గ్రామం యానాది కాలనీవాసి తాటిముక్కల అంకయ్య (54) మృతి చెందాడు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.