News July 5, 2024

ప్రొద్దుటూరులో APEAPCET కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్

image

ప్రొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో APEAPCET-2024 కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిలింగ్ సెంటర్‌కు కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ కేవీ రమణయ్యను అధికారులు నియమించారు. ఆయన మాట్లాడుతూ..నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. సందేహాలుంటే హెల్ప్ లైన్ సెంటర్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News October 14, 2024

కడపలో ప్రారంభమైన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ

image

నూతన మద్యం పాలసీకి సంబంధించి కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ శివ శంకర్, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఒక్కో దుకాణానికి లాటరీ పద్ధతిలో లైసెన్స్ కేటాయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 139 మద్యం దుకాణాలకు సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది.

News October 14, 2024

అన్నమయ్య జిల్లా స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. అందరూ కచ్చితంగా సెలవు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సెలవు రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు అంగన్వాడీలకు వర్తిస్తుంది. కాగా కడప జిల్లాకు ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి సెలవు ప్రకటించలేదు.

News October 14, 2024

కడప: నేటినుంచి యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం

image

కడప జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఆరిఫ్ తెలియజేశారు. నగరంలోని కెనరా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సెల్ ఫోన్ రిపేరింగ్ -సర్వీసింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ విభాగాలలో శిక్షణ ఉంటుందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.