News March 22, 2024

ప్రొద్దుటూరు: ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య

image

ప్రొద్దుటూరులో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బీటెక్ సీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న నవ్య అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్ కు గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన నవ్య ఇక్కడ చదువుతోంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.

Similar News

News February 15, 2026

ప్రొద్దుటూరు: కుటుంబీకులను తిట్టాడని చంపాడు

image

ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్డులోని నాగులకట్ట వీధిలో 3 రోజుల క్రితం జరిగిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు వినయ్‌ను త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ కొండారెడ్డి ఆదివారం తెలిపారు. మద్యం తాగే సమయంలో కుటుంబ సభ్యులను దూషించాడనే కోపంతో వినయ్ కత్తితో గొంతులో పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. బొల్లవరం బస్‌స్టాప్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

News February 15, 2026

కొండాపురం: 108 వాహనంలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

image

కొండాపురం మండలం వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన గర్భిణి 108 వాహనంలోనే ఆదివారం సాయంత్రం బిడ్డను ప్రసవించింది. గ్రామానికి చెందిన ప్రత్యూష పురుటి నొప్పులు రావడంతో 108 వాహనంలో కొండాపురం ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు. మార్గమధ్యలో నొప్పులు అధికం కావడంతో 108 వాహన EMT సునీత పురుడు పోశారు. దీంతో ప్రత్యూష ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగానే ఉన్నట్లు సునీత తెలిపారు.

News February 15, 2026

కడప: ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర

image

కడప జిల్లా శైవ క్షేత్రాలకు ప్రసిద్ధి. అందులో ప్రధానంగా పొలతల, నిత్యపూజకోన, సంగమేశ్వర ఆలయం, ముక్కొండ, పుష్కగిరి, అల్లాడుపల్లెలో వీరభద్ర స్వామి దేవాలయం, గవిమల్లేశ్వరుని కొండ, లంకమల మొదలైన వాటిలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉండగా వేలల్లో భక్తులు దర్శించుకుంటారు. ఇప్పటికే ఆయా దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినాన మీరు ఏ గుడికి వెళ్తున్నారు.