News August 8, 2024

ప్రొద్దుటూరు: ఇటుకలు మీదపడి బేల్దారి మృతి

image

ప్రొద్దుటూరు మౌలానా ఆజాద్ వీధిలో ఇంటి నిర్మాణ పని జరుగుతుండగా ఇటుకలు మీద పడటంతో బేల్దారి పల్లా విశ్వనాథ్ (46) మృతి చెందాడు. బుధవారం మౌలానా ఆజాద్ వీధిలో నూతన ఇంటి నిర్మాణ పనులకు విశ్వనాథ్ వెళ్లాడు. యంత్రం సహాయంతో కింద ఉన్న ఇటుకలను భవనం పైకి చేర్చే క్రమంలో ప్రమాదవశాత్తు కొన్ని ఇటుకలు జారి విశ్వనాథ్‌పై పడ్డాయి. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News September 15, 2024

4వ స్థానం పొందిన కడప జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్టు

image

9వ అంతర్ జిల్లాల సబ్ జూనియర్స్ రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో కడప జిల్లా బాలుర జట్టు నాల్గవ స్థానం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో ఈనెల 13వ తేది నుంచి 15వ తేది వరకు ఈ పోటీలు సాధించింది. ఇందులో ప్రతిభ కనబరిచిన బాలుర జట్టును వైఎస్ఆర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వెంకట రమణ, కోచ్ సురేంద్ర అభినందించారు.

News September 15, 2024

కడప: మీపై కేసులు ఉన్నాయా.. ఇలా చేయండి.!

image

చిన్న కారణాలతో కేసుల వరకు వెళ్లిన వారిని పిలిపించి సెటిల్మెంట్ చేసి పరిష్కరించే కార్యక్రమమే లోక్ అదాలత్. కడప జిల్లా వ్యాప్తంగా 3200 కేసులు శనివారం పరిష్కారం అయ్యాయని, కక్షిదారులకు రూ.6,24,18,818 చెల్లింపు జరిగిందని కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 15, 2024

పర్యాటక దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి: కలెక్టర్

image

ఈనెల 27న గండికోటలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలకు ఎలాంటి కొరత లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ మీటింగ్ హాలులోని గండికోటలో శనివారం సమావేశం అయ్యారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రంలో వైభవంగా పర్యాటక దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు.