News August 21, 2024
ప్రొద్దుటూరు: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం

తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశారంటూ ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన మహబూబ్ బాషా మంగళవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మస్తాన్ వలికి ఏపీఎస్పీడీసీఎల్లో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన భానుప్రతాప్ రెడ్డి రెండేళ్ల క్రితం ఫోన్ పే ద్వారా పలుమార్లు రూ.2.47లక్షలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు వెనక్కి ఇవ్వాలన్నా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.
News November 21, 2025
కడప కలెక్టరేట్లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

కడప కలెక్టరేట్లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.