News August 6, 2024
ప్రొద్దుటూరు: ఎస్సీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలకు వినతి

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రొద్దుటూరు ఎస్సీ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. విద్యార్థి సంఘం నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్‌కు వినతిపత్రం అందించారు. వసతి గృహంలో మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్థానిక విద్యార్థులను మాత్రమే చేర్పిస్తున్నారని జిల్లా అధ్యక్షులు నాగేంద్ర ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News December 7, 2025
పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.

ప్రొద్దుటూరు: రూ.10 లక్షల పెనాల్టీ.!

ప్రొద్దుటూరులో జరుగుతున్న స్మగ్లింగ్ వ్యాపారంపై జీఎస్టీ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్, ట్రావెల్, కొరియర్ కార్యాలయాలు వందకుపైగా ఉన్నాయి. వీటిద్వారా ప్రతిరోజూ పెద్ద మొత్తంలో బంగారం, బట్టలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మందులు అక్రమంగా రవాణా అవుతున్నాయి. వీటిపై అధికారులు నిఘా పెట్టారు. శుక్రవారం దాడులు చేసి ఒక్క రోజులోనే రూ.10 లక్షలు పైగా పెనాల్టీ వసూలు చేశారు.