News June 7, 2024
ప్రొద్దుటూరు: కార్పొరేషన్ల డైరెక్టర్లు రాజీనామా
ప్రొద్దుటూరుకు చెందిన పలువురు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు YCP ఓటమితో శుక్రవారం రాజీనామా చేశారు. నగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళి,ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉమామహేశ్వరి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ రవిచంద్ర, పూసల కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటరమణ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి, అటవీ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, నాటక అకాడమీ డైరెక్టర్ లక్ష్మీదేవి రాజీనామా చేశారు.
Similar News
News December 14, 2024
రాష్ట్రంలో రాజంపేట టాప్
కోటి సభ్యత్వాలే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. రూ.100 కడితే రూ.5 లక్షల బీమా ఉండటంతో పలువురు టీడీపీ సభ్యత్వాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో నిన్నటి వరకు మొత్తం సభ్యత్వాల సంఖ్య 71 లక్షలు దాటింది. ఇందులో రాజంపేట టాప్‌లో ఉంది. ఆ తర్వాతే సీఎం సొంత నియోజకవర్గం కుప్పం ఉండటం గమనార్హం.
News December 13, 2024
జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య: YS జగన్
కడప జిల్లా వేముల మండల కేంద్రంలో నీటి సంఘాల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతల దారుణాలను ప్రపంచానికి చూపిస్తున్న జర్నలిస్ట్‌లపై దాడి హేయమైన చర్యని YS జగన్ అభిప్రాయపడ్డారు. X వేదికగా ఈ దాడిని ఆయన శుక్రవారం తీవ్రంగా ఖండించారు. మీడియాపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన అభివర్ణించారు. నిజాలు నిర్భయంగా వెలికితీస్తున్న మీడియా గొంతు నొక్కేయాలనుకోవడం కూటమి ప్రభుత్వం దుర్మార్గపు చర్య అన్నారు.
News December 13, 2024
కీలక విషయాలు బయటపెట్టిన కడప కలెక్టర్
సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కడప కలెక్టర్ శ్రీధర్ కీలక విషయాలు బయటపెట్టారు. ‘వేరే జిల్లాలో ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌తో మా జిల్లాలో 3,600 మంది పింఛన్ తీసుకుంటున్నారు. వీరిపై అనుమానంతో తనిఖీలు చేయగా కేవలం 127 మందే అర్హులని తేలింది. మిగిలిన వాళ్లు ఫేక్ సర్టిఫికెట్లతో పింఛన్ తీసుకున్నారు’ అని CMకు చెప్పారు. వెంటనే వారి నుంచి పెన్షన్ డబ్బులు రికవరీ చేసి.. అవసరమైతే కేసు పెట్టాలని CM ఆదేశించారు.