News March 22, 2025
ప్రొద్దుటూరు: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే జిల్లా బహిష్కరణ

నేటి నుంచి జరగనున్న IPL క్రికెట్ సందర్భంగా బెట్టింగ్ అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీఎస్పీ భావన పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉందని, గతంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన వారిని ఇప్పటికే గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామన్నారు. పదే పదే బెట్టింగ్ నిర్వహిస్తే జిల్లా బహిష్కరణ ఉంటుందన్నారు.
Similar News
News April 18, 2025
వేంపల్లెలో బాలికపై అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

వేంపల్లెలో ఓ బాలికను ఇద్దరు యువకులు వారం రోజుల క్రితం కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితులు ఫాజిల్, ఆనంద్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై రంగారావు తెలిపారు. కోర్టులో హాజరుపర్చగా నిందుతులకు రిమాండ్ విధించగా కడప సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
News April 18, 2025
కడపలో ఇదే దొంగల కారు జాగ్రత్త..!

నెల్లూరు జిల్లాలో వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు కడప జిల్లా వైపు రావడంతో కడప పోలీసులకు సమాచారమిచ్చారు. లింగాపురం వద్ద కాపు కాసిన పోలీసులను చూసి కల్లూరు మీదుగా పరారయ్యారు. వి.రాజుపాలెం వద్ద ఒకరు దొరకకగా ఇద్దరు జంపయ్యారు. ట్రైనీ DSP భవాని, చాపాడు, కమలాపురం పోలీసుల సమన్వయంతో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
News April 18, 2025
కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా అమర్నాథ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ఆధ్వర్యంలో కార్యవర్గ నియామకాన్ని చేపట్టారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డిని పార్టీ జిల్లా సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని అందజేశారు.