News August 20, 2024
ప్రొద్దుటూరు టౌన్ బ్యాంకు ఛైర్మన్గా బొగ్గుల వెంకట సుబ్బారెడ్డి

ప్రొద్దుటూరు కో-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ పదవి TDP ఖాతాలోకి చేరింది. YCP తరఫున ఉన్న ఛైర్మన్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ పదవికి సోమవారం ఎన్నికలు జరిగాయి. TDP అభ్యర్థిగా 4వ డైరెక్టర్ బొగ్గుల వెంకటసుబ్బారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈయనకు పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఛైర్మన్గా వెంకట సుబ్బారెడ్డి ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఎ.రాజశేఖర్ ప్రకటించారు.
Similar News
News November 7, 2025
నేడు కడపలో భారీ ర్యాలీ

WWC భారత్ గెలిచిన తర్వాత తొలిసారి కడపకు నల్లపురెడ్డి శ్రీచరణి నేడు రానున్నారు. కడప క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆమెకు ఇర్కాన్ సర్కిల్ వద్ద సాయంత్రం స్వాగతం పలుకుతారు. తర్వాత హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ చేస్తారు. రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆమెను సన్మానిస్తారు. ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆమె సాయంత్రానికి కడపకు వస్తారు.
News November 7, 2025
కడప: వేలంలోకి శ్రీచరణి

మన కడప అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి వుమెన్స్ వరల్డ్కప్లో సత్తాచాటిన విషయం తెలిసిందే. కప్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించింది. అయినప్పటికీ WPLలో ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిటైన్ చేసుకోలేదు. దీంతో త్వరలో జరగనున్న WPL-2026 వేలంలోకి శ్రీచరణి రానుంది. గత సీజన్లో ఆమెకు ఢిల్లీ జట్టు రూ.55 లక్షలు చెల్లించగా.. వేలంలో రూ.కోట్లలో ధర దక్కే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు.
News November 7, 2025
సెలవులు రద్దు: కడప DEO

సెలవులపై కడప DEO షంషుద్దీన్ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి నెలలోని రెండో శనివారం సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఈ మూడు నెలల్లోని ఆయా శనివారాల్లో స్కూళ్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ నేపథ్యంలో గత నెలలో వరుస సెలవులు ఇచ్చారు. ఈక్రమంలో ఈ మూడు సెలవులను వర్కింగ్ డేస్గా ప్రకటించారు.


