News September 24, 2024

ప్రొద్దుటూరు: తండ్రి హత్య కేసులో.. ముగ్గురికి యావజ్జీవ శిక్ష

image

ఆస్తి, అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని తండ్రిని హత్య చేసిన కేసులో మంగళవారం ప్రొద్దుటూరు 2nd ADJ GS రమేశ్ కుమార్ ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కడప హోటల్ లక్ష్మీ భవన్ యజమాని ముద్దంశెట్టి వెంకటసుబ్బయ్యను ఆయన చిన్న కొడుకు శివ ప్రసాద్, జనార్దన్, పెద్దకోడలు సుప్రజ, 2014 డిసెంబర్ 30న హత్య చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి ముగ్గురికి యావజ్జీవ శిక్ష, రూ.4 లక్షలు జరిమానా విధించారు.

Similar News

News October 27, 2025

కడప జిల్లా కలెక్టర్ తనయుడికి పలువురు నేతల శుభాకాంక్షలు

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనయుడు రిసెప్షన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రిసెప్షన్‌కు ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన జంట వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

News October 27, 2025

మొంథా తుఫాన్.. కడప JC కీలక సూచనలు

image

కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు JC అదితి సింగ్ పలు <>సూచనలు<<>> చేశారు.
➤సోషల్ మీడియాలో వచ్చే అవాస్థవాలను నమ్మొద్దు.
➤వాతావరణ హెచ్చరికల కోసం సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకొని, SMSలను గమనిస్తూ ఉండండి.
➤విలువైన పత్రాలను వాటర్ ఫ్రూఫ్ కవర్లలో ఉంచండి.
➤మీ ఇల్లు సురక్షితం కాకపోతే.. సురక్షితమైన స్థానాలకు వెళ్లండి.
➤పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్ల కింద ఉండకండి.
>> SHARE IT

News October 27, 2025

కడప జిల్లాకు రెడ్ అలెర్ట్.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

image

భారీ వర్షాల నేపథ్యంలో కడప జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో JC అదితి సింగ్, జిల్లా అధికారులు అప్రమత్తం అయ్యారు. అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
కడప కలెక్టరేట్: 08562-246344
కడప ఆర్డీవో: 08562-295990
జమ్మలమడుగు ఆర్డీవో: 95028 36762
బద్వేలు ఆర్డీవో: 6301432849
పులివెందుల ఆర్డీవో: 8919134718.
>> SHARE IT