News August 10, 2024
ప్రొద్దుటూరు: ధర్మవరం ఎక్స్ప్రెస్లో పొగలు.. అరగంట ఆగిన రైలు

ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 9.30కు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్కు రైలు వచ్చి ఆగింది. బండిని ఆపే సమయంలో వర్షం పడగా, పదే పదే బ్రేకులు వేయడంతో ఏసీ బోగి చక్రాల కింద ఉన్న బ్రేకర్ నుంచి పొగ వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య ఉందని గుర్తించి, దాన్ని అధికారులు సరిచేయగా 30నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది.
Similar News
News October 17, 2025
కడప: బిడ్డకు జన్మనిచ్చిన 16 ఏళ్ల బాలిక

ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో వెలుగు చూసింది. ఓ గ్రామానికి చెందిన చెంచయ్యగారి ప్రసాద్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే ఊరికి చెందిన 16 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. చంపుతానని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలికకు గర్భం రావడంతో అబార్షన్ చేయించాలని ప్రయత్నించాడు. ఈక్రమంలో జులైలో నిందితుడిపై పోక్సో కేసు కింద నమోదు చేశారు. ఆ బాలిక ఇవాళ తెల్లవారుజామున బిడ్డకు జన్మనిచ్చింది.
News October 16, 2025
కడప: ఈ టేస్ట్ ఎక్కడా రాదండోయ్.!

కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ కాదండీ. నోరూరించే వంటకాలు కూడా మా సొంతం. ఇక్కడ రాగి సంగటి-నాటుకోడి ఫేమస్. అంతేకాందండోయ్.. ఉగ్గానిలోకి మిరపకాయ బజ్జి తింటే ఆహా అనాల్సిందే. ఇక చెన్నూరు బిర్యానీ, గువ్వల చెరువు పాలకోవ, జమ్మలమడుగులో దొరికే కుష్కాను ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే. ఇక దోశపై కారం పట్టించి.. కాస్త పప్పుల పొడి వేసి తింటే నోరూరాల్సిందే. ఇక పొంగనాలు తినని కడప జిల్లా వాసి ఉండరు.
#ప్రపంచ ఆహార దినోత్సవం
News October 15, 2025
జమ్మూలో కడప జిల్లా జవాన్ మృతి.!

కడప జిల్లా వేంపల్లి మండలం ముత్తుకూరుకు చెందిన BSF జవాన్ చపాటి నవీన్ (28) జమ్మూ కాశ్మీర్లోని బారాముల ప్రాంతంలో అకస్మికంగా మృతి చెందారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అధికార లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.