News August 10, 2024

ప్రొద్దుటూరు: ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. అరగంట ఆగిన రైలు

image

ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 9.30కు ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చి ఆగింది. బండిని ఆపే సమయంలో వర్షం పడగా, పదే పదే బ్రేకులు వేయడంతో ఏసీ బోగి చక్రాల కింద ఉన్న బ్రేకర్ నుంచి పొగ వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య ఉందని గుర్తించి, దాన్ని అధికారులు సరిచేయగా 30నిమిషాల తర్వాత రైలు బయలుదేరింది.

Similar News

News September 12, 2024

పోరుమామిళ్ల పోలీస్ స్టేషను తనిఖీ చేసిన డీఐజీ

image

పోరుమామిళ్ల పోలీస్ స్టేషను కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్లోని రికార్డులను ఆయన తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని క్రైమ్ రిపోర్ట్ గురించి సీఐని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పోలీసులకు ఆయన పలు సూచనలు చేశారు.

News September 12, 2024

దేవుని కడపలో ఈ నెల 15 నుంచి ఉత్సవాలు

image

తిరుమలకు తొలిగడపగా పేరున్న దేవునికడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15వ తేదీ నుంచి దోష పరిహార ఉత్సవాలు జరగనున్నాయి. ఏడాది పాటు ఆలయంలో పఠనోత్సవాలు సందర్భంగా జరిగిన దోషాల పరిహారం కోసం ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 15న తొలి రోజున ఆదివారం అంకురార్పణ, పవిత్రాల ప్రతిష్ఠ, 16న సమర్పణ, 17న ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు.

News September 12, 2024

సైకో ఐడియాలు జగన్‌కే వస్తాయి: బీటెక్ రవి

image

గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు ప్రకాశం బ్యారేజీ వద్ద బోటును అడ్డువేశారు. ఇప్పుడు ఏకంగా బ్యారేజీనే పగలకొట్టడానికి YS జగన్ ప్రయత్నించాడని బీటెక్ రవి X వేదికగా ఆరోపించారు. ఇటువంటి సైకో ఐడియాలు జగన్‌కే వస్తాయని విమర్శించారు. ‘బ్యారేజీని ఢీకొట్టిన మూడు పడవలు YCP నేతలవి కావడం ఒక రుజువు అయితే.. గతంలో చంద్రబాబు నివాసాన్ని ముంచేందుకు జగన్ ఇలాగే బోటును అడ్డు వేయించాడు.’ అని పోస్ట్ చేశారు.