News January 20, 2025

ప్రొద్దుటూరు: ‘ప్రభుత్వం అప్పులు, ఖర్చులను తెలపాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.

Similar News

News January 21, 2025

కడప: 23న జిల్లా స్థాయి హాకీ ఎంపికలు

image

కడప నగరంలోని డాక్టర్ వైయస్సార్ క్రీడా పాఠశాలలో ఈనెల 23వ తేదీన జిల్లా స్థాయి హాకీ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఎం.శేఖర్ తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మహిళల విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనే క్రీడాకారులు 01-01-2009 తర్వాత పుట్టినవారు అర్హులన్నారు. జూనియర్ విభాగంలో పాల్గొనే వారు 01-01-2006 తర్వాత పుట్టినవారు అర్హులన్నారు.

News January 21, 2025

కడప జిల్లాలో పశు వైద్య శిబిరాలు: జేసీ

image

కడప జిల్లాలో ఈనెల 20వ తేదీ నుంచి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ పేర్కొన్నారు. కడప కలెక్టర్‌లో పశు వైద్య శిబిరాలకు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 20, 2025

BREAKING: కడప జిల్లా ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్

image

కడప జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇవ్వగా ఇందులో భాగంగా కడపకు అశోక్ కుమార్‌ను నియమించారు. ఇక్కడ ఉన్న పూర్వపు ఎస్పీ హర్షవర్ధన్ రాజును నవంబర్‌లో అధికారులు బదిలీ చేయడంతో అప్పటినుంచి ఇంఛార్జి ఎస్పీగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కొనసాగుతూ వచ్చారు.