News February 15, 2025
ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. యువకుడిపై పోక్సో కేసు

ప్రొద్దుటూరు స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఓ వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ గోవింద్ రెడ్డి తెలిపారు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పిన నల్లబోతుల కుల్లాయప్పపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News March 28, 2025
క్రికెట్‌లో సత్తా చాటిన ఎర్రగుంట్ల క్రీడాకారిణి

వైయస్సార్ కడపజిల్లా, ఎర్రగుంట్ల మండలం యర్రంపల్లి గ్రామానికి చెందిన ఎన్.శ్రీచరణి బీసీసీఐ సీనియర్ ఉమెన్స్ ఛాలెంజర్ ట్రోఫీలో 6 వికెట్లు తీసి సత్తా చాటింది. గురువారం డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన మల్టీ డేస్ క్రికెట్ మ్యాచ్‌లో టీమ్-బీకి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి తొలిరోజు మ్యాచ్‌లో 32 ఓవర్లు వేసి 8 మెయిడిన్ ఓవర్లు, 6 వికెట్లు తీసి సత్తా చాటింది.
News March 27, 2025
కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు సహకారం అందించిన ఉమ్మడి కడప జిల్లా ZPTCలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్సార్, జగన్ మీద అభిమానంతో రామ గోవింద్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సహకారం అందించారని అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల పట్ల జిల్లా పరిధిలోని ZPTCలు పోరాటం కొనసాగించాలని సూచించారు.
News March 27, 2025
ప్రొద్దుటూరు: 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు

ప్రొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై పోక్సో కేసు నమోదైంది. మండలంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థి 32 ఫేక్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్లతో తన క్లాస్ అమ్మాయిలను వేధించాడు. విషయం తెలిసిన టీచర్ విద్యార్థిని హెచ్చరించారు. తమ బిడ్డనే మందలిస్తారంటూ సదరు విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో వారితో పాటు మరో వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది.