News March 19, 2024
ప్రొద్దుటూరు: బాలికపై అత్యాచారం.. ఐదుగురిపై కేసు
కల్లూరుకి చెందిన లింగం కిరణ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 10వ తరగతి చదువుతున్న బాలికకు కిరణ్‌తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో తన వెంట రావాలని బాలికను కిరణ్ భయపెట్టేవాడు. ఈ క్రమంలోనే బైక్‌పై తీసుకెళ్లి పలుసార్లు అత్యాచారం చేశాడు. సదరు బాలిక ఫిర్యాదు చేయడంతో నిందితుడితో సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 17, 2024
రాజంపేట: సెప్టెంబర్ 20న జాబ్ మేళా నిర్వహణ
రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 20న జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లోని యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైదియా దేవి పాల్గొన్నారు.
News September 17, 2024
కడప ఆర్మీ జవాన్ ఆకస్మిక మృతి
వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.
News September 17, 2024
ఎన్ఎంసీకి సీఎం లేఖ రాయడం దుర్మార్గం: తులసి రెడ్డి
మౌలిక వసతులు, సిబ్బంది కొరత సాకులు చూపి పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లు వద్దని సీఎం లేఖ రాయడం దుర్మార్గమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంపల్లిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సగం ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ఆ మాత్రాన వీటిని మూసేస్తారా అని ప్రశ్నించారు. ఎన్ఎంసీకి అండర్ టేకింగ్ లెటర్ ఇచ్చి మెడికల్ కళాశాల ప్రారంభించాలని కోరారు.