News June 4, 2024

ప్రొద్దుటూరు: భారీ మెజార్టీతో దూసుకెళ్తున్న టీడీపీ

image

ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గ 8వ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డికి 43,129 ఓట్లు. వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి 33,024 ఓట్లు వచ్చాయి. నంద్యాల వరద రాజుల రెడ్డి 10,105 లీడ్‌లో కొనసాగుతున్నారు.
7వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థికి 36,477, వైసీపీ అభ్యర్థికి 30,285 ఓట్లు వచ్చాయి.

Similar News

News September 19, 2025

ఉల్లి మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం: కలెక్టర్

image

జిల్లాలో ఉల్లి సాగుచేసిన రైతులకు నష్టం కలగకుండా మార్కెటింగ్‌కు అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శుక్రవారం జేసీ అతిథి సింగ్‌తో కలిసి ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి కొనుగోలుకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఉల్లి నిల్వలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు మార్కెఫెడ్ అధికారులు ప్రతిపాదనలు పంపాలన్నారు. రైతుల నుంచి లాభం ఆశించవద్దని వర్తకులకు సూచించారు.

News September 19, 2025

కడప: ఉల్లి రైతులకు శుభవార్త

image

ఉల్లి సాగు చేసిన రైతులంతా తమ పంటను రైతు బజార్లు, మార్కెట్ యార్డుల్లో విక్రయించుకోవచ్చని, ఎటువంటి గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. కిలో రూ.12 చొప్పున రైతులు ఉల్లిని విక్రయించాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News September 19, 2025

కడప: పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు..!

image

తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు అదుపులోకి తీసుకునట్లు తెలుస్తోంది. మండలంలోని పెద్ద శెట్టిపల్లి వద్ద ఎర్రచందనం తరలించేందుకు వెళ్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. 15 మంది కూలీలను అదుపులోకి తీసుకుంటూ సమాచారం. వీరి వెనుక ఉన్న ప్రధాన స్మగ్లర్ ఎవరనే దానిపై కడపకు తరలించి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.