News August 9, 2024
ప్రొద్దుటూరు: రేషన్ డీలర్ ఆత్మహత్య

ప్రొద్దుటూరులో రేషన్ డీలర్ రామకృష్ణ బలవన్మరనానికి పాల్పడ్డాడు. పది సంవత్సరాలుగా ప్రొద్దుటూరులో తనకు జీవనాధారంగా ఉన్న రేషన్ షాపును టీడీపీ నేతలు తొలగించడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2026
వేంపల్లి: నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

వేంపల్లి మండలం నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం రెండు గంటలకు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
News February 25, 2026
కడప: 3వ రోజు ఇంటర్ పరీక్షలకు 96% విద్యార్థులు హాజరు

కడప జిల్లాలో బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ పేపర్-1 పరీక్షకు 96% విద్యార్థులు హాజరయ్యారు. నేడు 62 సెంటర్లలో 18,165 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 17,391 మంది రాశారు. 774 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 16,685 మందికి గాను.. 16,068 మంది హాజరవ్వగా, 617 మంది పరీక్షలు రాయలేదు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,480 మందికి గాను.. 1,323 మంది హాజరవ్వగా, 157 మంది గైర్హాజరయ్యారు.
News February 25, 2026
ప్రొద్దుటూరు: అటవీ పరిరక్షణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

ప్రొద్దుటూరు రాజీవ్ గాంధీ నేషనల్ ఏకో పార్క్, రిజర్వ్ ఫారెస్ట్ పరిరక్షణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కడపలో జరిగిన అటవీ పరిరక్షణ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని జాతీయ పార్కు, రక్షిత అడవి, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల చుట్టూ ఏకో-సెన్సిటివ్ జోన్ అమలుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అటవీ, తదితర అధికారులు పాల్గొన్నారు.


