News December 2, 2024
ప్రొద్దుటూరు: లాడ్జీలో దారుణ హత్య

ప్రొద్దుటూరు సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జీలో సోమవారం ఉదయం దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తలపై బీరు సీసాతో కొట్టి హత్య చేసి ఉండచ్చని లాడ్జీ సిబ్బంది చెబుతున్నారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతునికి 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 6, 2025
క్రికెటర్ శ్రీచరణి తండ్రికి రూ.5 లక్షల చెక్కు అందజేత

కడప క్రికెట్ తేజం నల్లపురెడ్డి శ్రీచరణికి జిల్లా TDP అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ప్రకటించిన రూ.5 లక్షల ప్రోత్సాహక చెక్కును శనివారం MLA మాధవి, క్రికెట్ స్టేడియం ఛైర్మన్ శ్రావణ్ రాజ్‌రెడ్డి కలిసి ఆమె తండ్రికి అందజేశారు. మహిళా క్రికెట్ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి కడపకు గర్వకారణమై నిలిచిన శ్రీచరణిని అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
News December 6, 2025
అన్నమయ్య కాలిబాట విషయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం పిల్లి: శ్యామల

అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు పెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొమరం పులే గాని కాలిబాట విషయంలో పిఠాపురం పిల్లిలా ప్రవర్తించారని YCP రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి శ్యామల తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం నడింపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. అనంతరం ఆమె అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు విధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని విమర్శించారు.
News December 6, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు.!

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,740
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ. 11,721
☛ వెండి 10 గ్రాములు ధర: రూ.1780.0=


