News June 29, 2024
ప్రొద్దుటూరు: ‘విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి’

విద్యార్థులు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ అపర్ణ శ్రీరామ్, యునాని డాక్టర్ నిరంజన్ నాయక్ తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరు హోమస్ పేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. 260 మంది విద్యార్థులకు వ్యాధి నిరోధక హోమియో మందులను ఇచ్చారు.
Similar News
News November 18, 2025
కడప: 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలు గుర్తించిన అధికారులు

జిల్లాలో గత ప్రభుత్వంలో ఫేజ్-3లో 13,681ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వీటి నిర్మాణాలను వైసీపీ నేతలు చేపట్టారు. ఇప్పుడు వీటిపై విచారణ జరుగుతోంది. ప్రత్యేక యాప్ ద్వారా ఫిజికల్, ఫైనాన్స్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 50 శాతం ఇళ్ల నిర్మాణాల్లో తేడాలున్నట్లు తెలిపారు. సుమారు 6,713 ఇళ్లు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 6,258 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు: భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో సోమవారం CTO జ్ఞానానంద రెడ్డి ఆధ్వర్యంలో స్టేట్ ట్యాక్స్ అధికారుల బృందం సోదాలు నిర్వహించాయి. భారీ మొత్తంలో జీఎస్టీ ఎగవేతను గుర్తించారు. 2021 నుంచి జీఎస్టీ బకాయిలు సుమారు రూ.1.50 కోట్ల గుర్తించారు. ఎగ్జిబిషన్ నుంచి సుమారు రూ.1.కోటి, కూరగాయల మార్కెట్, షాపు రూములు ఇతరత్రా వాటి నుంచి మరో రూ.50 లక్షలు జీఎస్టీ ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది.