News November 12, 2024
ప్రొద్దుటూరు: సినీ పక్కీలో భారీ దొంగతనం

కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని నంగనూర్‌పల్లిలో మంళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. RTC ఏఎస్ఐ భైరగాని మునయ్య ఇంట్లో దొంగలు సుమారు 25 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ చోరీ జరిగింది. దొంగతనాన్ని గుర్తించకుండా సనీ పక్కీలో వారు ఇల్లంతా కారంపొడి చల్లి, తమ ముద్రలను కనపడకుండా జాగ్రత్త పడ్డారు.
Similar News
News November 15, 2025
పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

కడప కలెక్టరేట్‌లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.
News November 14, 2025

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.