News November 29, 2024

ప్రొస్టేట్ సమస్యలకు రెజ్యూమ్ వాటర్ వెపర్ థెరపీతో చికిత్స

image

ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యకు ఆపరేషన్ లేకుండా వాటర్ వెపర్ థెరపీతో AINU హాస్పిటల్ చికిత్స అందిస్తోంది. అంగ‌స్తంభ‌న, వీర్య‌స్ఖ‌ల‌నం స‌రిగా కాక‌పోవ‌డం లాంటి స‌మ‌స్య‌లకు ఈ వాట‌ర్ వెపర్ థెర‌పీతో సరైన పరిష్కారం లభిస్తుంది. ఇది చేసిన త‌ర్వాత నెల రోజుల్లోపు ఫ‌లితాలు క‌నిపిస్తాయని, ఈ స‌మ‌స్య‌లు ఉన్నవారికి ఈ చికిత్స ఒక వ‌రం లాంటిద‌ని AINU ఎండీ, చీఫ్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ సి.మ‌ల్లికార్జున తెలిపారు.

Similar News

News November 27, 2025

విశాఖ: మెడికల్ షాపుల్లో తనిఖీలు.. ఒకటి సీజ్

image

విశాఖలో పలుచోట్ల డ్రగ్ కంట్రోలర్ సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ షాపుల తనిఖీలు చేపట్టారు. డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోహన్ ఫార్మసీ దుకాణాలు నడుస్తున్నాయి. వీటిపై PGRSలో ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసి ఎంవీపీ బ్రాంచ్ సీజ్ చేశారు. వన్ టౌన్, ఇసుకతోట, ఎంవీపీ, కంచరపాలెం, మల్కాపురం షాపులకు నోటీసులు జారీ చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ తెలిపారు. అధిక ధరలు, కాలం చెల్లిన మందులు ఉన్నాయని ఆయన చెప్పారు.

News November 27, 2025

విశాఖ: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. సింహాచలం డిపో నుంచి గోపాలపట్నం వైపు బస్సు వెళుతుండగా.. రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా చక్రాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గోపాలపట్నం ఎస్సై అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.