News August 7, 2024
ప్రొ. జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తాం: సీఎం

తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నికుడు , సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన కృషిని, త్యాగాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిచ్వాసలుగా జీవిత పర్యంతం గడిపిన ప్రొ.జయశంకర్‌ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆశయ సాధనకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు.
Similar News
News October 3, 2025
హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమతి పునరుద్ధరణ

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమతుల్ని పునరుద్ధరించామని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎకరాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పునరుద్ధరించారు.
News October 3, 2025
HYD: డబుల్ బెడ్ రూం పట్టాల పంపిణీ

మినిస్టర్ క్వార్టర్స్‌లో డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్‌పేట-134, బహుదూర్‌పురా-294, బండ్లగూడ-155, చార్మినార్-209, సైదాబాద్‌లో 206 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతనం పట్టాలు పంపిణీ చేసినట్లు పొన్నం తెలిపారు.
News October 3, 2025
షాద్‌నగర్: అమ్మవారి చీరల వేలం@రూ.13లక్షలు

నవరాత్రులను పురస్కరించుకొని 11 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మధురాపూర్ గ్రామంలో అమ్మవారికి 11రోజుల పాటు అలంకరణలో ఉపయోగించిన 11 చీరలకు వేలంపాటను నిర్వహించారు. వేలం పాటలో 11 చీరలను రూ.13,55,149కు గ్రామస్థులు దక్కించుకున్నారు. గతంలో వినాయకుడి లడ్డును కూడా రూ.12 లక్షలు దక్కించుకోవడం గమనార్హం.