News March 14, 2025
ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో శనివారం ప్రతి గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు. భూమిలో కుళ్లిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
కోర్టుకెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తా: ఎమ్మెల్యే

హైదరాబాద్: కొండాపూర్‌లో 39 ఎకరాల స్థల వివాదంలో హైడ్రా రంగంలోకి దిగింది. శనివారం పోలీసుల బందోబస్తుతో అక్కడికి చేరుకున్న అధికారులు, స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఈ స్థలం మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు చెందినదని సమాచారం. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లి నష్టపరిహారం వసూలు చేస్తామని తెలిపారు.
News April 20, 2025
అనితర సాధ్యుడు చంద్రబాబు: పవన్ కళ్యాణ్

AP CM చంద్రబాబుకు Dy.CM పవన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘అనితర సాధ్యుడు చంద్రబాబు. ఆర్థికంగా కుంగిపోయి, అభివృద్ధి అగమ్యగోచరంగా తయారై శాంతిభద్రతలు క్షీణించిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేయడం ఆయనలాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. ఆయన విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థల్ని నడిపించే విధానం స్ఫూర్తిదాయకం’ అని ట్వీట్ చేశారు.
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.