News March 10, 2025

‘ప్లాస్టిక్ రహిత జిల్లాగా పార్వతీపురంను మారుద్దాం’

image

జిల్లాలో ప్లాస్టిక్‌ను, చెత్తను పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, పంచాయతీల్లో దీనిపై ఒక తీర్మానం చేసి అమలు చేయాలని అన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు బోర్డులు, ఫ్లెక్సిలను ఏర్పాటుచేయాలని సూచించారు.

Similar News

News November 20, 2025

NLG: వామ్మో కోతులు

image

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.

News November 20, 2025

మెదక్: స్థానిక పోరు.. ఆశావాహుల్లో కొత్త ఊపు!

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సందడి మొదలైంది. బీసీ రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. సంగారెడ్డి జిల్లాలో 647 GPలు, 5,778 వార్డులు, మెదక్‌‌ జిల్లాలో 469 GPలు, 4,082 వార్డులు, సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

News November 20, 2025

ఇజ్రాయెల్ దాడిలో 27 మంది మృతి

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పదే పదే సీజ్ ఫైర్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 27 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. గాజాలో 14 మంది, ఖాన్ యూనిస్ ఏరియాలో 13 మంది మరణించినట్లు వెల్లడించారు. హమాస్ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడటంతోనే దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పరిస్థితులు మెరుగవుతున్న సమయంలో మరోసారి దాడులు ఆందోళనకు గురి చేస్తున్నాయని గాజా స్థానికులు చెబుతున్నారు.