News February 6, 2025

ప.గో: అధికారులతో కలెక్టర్ సమావేశం 

image

19 ఏళ్ల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక ఇప్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఫిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవంపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ నిర్వహించి పలు సూచనలను జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి ఆల్బెండజోల్ ఇవ్వాలన్నారు.

Similar News

News October 17, 2025

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

image

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.

News October 17, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు 42 మంది విద్యార్థులు ఎంపిక

image

ఉమ్మడి ప.గో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్‌ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత నెల 12 నుంచి ఈనెల 15 వరకు అండర్‌-19 విభాగంలో వీరంతా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి అభినందించారు.

News October 17, 2025

‘కార్తీక మాసంలో పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి’

image

కార్తీక మాసంలో పేరుపాలెం బీచ్‌కు వచ్చే పర్యాటకులకు ఆయా శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సాపురం ఆర్డీవో దాసిరాజు అధికారులకు సూచించారు. గురువారం కేపీపాలెం బీచ్ వద్ద కార్తీక మాస ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బీచ్‌లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్‌పీఓ, ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు.