News February 6, 2025
ప.గో: అధికారులతో కలెక్టర్ సమావేశం

19 ఏళ్ల లోపు పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక ఇప్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఫిబ్రవరి 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల దినోత్సవంపై వివిధ శాఖల అధికారులతో కన్వర్జెన్సీ నిర్వహించి పలు సూచనలను జారీ చేశారు. నిర్దేశించిన సమయానికి ఆల్బెండజోల్ ఇవ్వాలన్నారు.
Similar News
News March 28, 2025
ప.గో: AMC ఛైర్మన్లు ఎవరంటే..?

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురికి నామినేటెడ్ పదవులు దక్కాయి. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్లుగా పలువురికి అవకాశం దక్కింది.
☞ తణుకు: కొండే శివ (టీడీపీ)
☞ తాడేపల్లిగూడెం: మంగాబాయి (జనసేన, పైఫొటో)
☞ ఉంగుటూరు: కరేటి జ్యోతి(జనసేన)
☞దెందులూరు: గారపాటి రామసీత(టీడీపీ)
☞ ఏలూరు: మామిళ్లపల్లి పార్థసారథి (టీడీపీ)
News March 28, 2025
అత్తిలిలో కూటమి నేతల ఆందోళన అందుకేనా?

అత్తిలి ఎంపీపీ తీవ్ర ఉత్కంఠను రేపుతున్న విషయం తెలిసిందే. వైసీపీకి చెందిన 13 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నిక సమావేశానికి హాజరు కాకుండా కూటమి శ్రేణులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను వైసీపీ నేతలు నిర్బంధించారని.. వారి కోసమే తమ ఆందోళన అని కూటమి శ్రేణులు అంటున్నాయి.
News March 28, 2025
ప.గో: 15 ఉపసర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపసర్పంచ్‌ల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 15 ఉప సర్పంచుల స్థానాల్లో ఆయా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మరోవైపు పదవీకాలం కేవలం 9 నెలలు మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.