News May 20, 2024

ప.గో.: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

ప.గో. జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. SI శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన త్రినాథ్ ప్రసాద్‌‌కు 15ఏళ్ల క్రితం సుస్మితతో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సుస్మిత ఉరేసుకొని చనిపోయిందని ఆమె తండ్రికి ఫోన్లో చెప్పాడు. కూతురి మృతికి కారణం ఆమె భర్త, అత్తమామలే అంటూ తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

Similar News

News December 9, 2025

ప.గో జిల్లా మొత్తం 8 పరీక్షా కేంద్రాలు

image

డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరిగే టెట్(TET) పరీక్షల కోసం జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం 5, నరసాపురం 1, తాడేపల్లిగూడెంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 12,985 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

News December 9, 2025

‘పరీక్షా పే చర్చ’.. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ల నియామకం

image

‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు పశ్చిమ, ఏలూరు జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించినట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. పశ్చిమ గోదావరికి ఎం.విజయప్రసన్న, బి.జాన్సన్‌లు, ఏలూరు జిల్లాకు వై.స్వరాజ్యశ్రీనివాస్, సీహెచ్ గోవిందరాజులు, శామ్యూల్‌ సంజీవ్‌లు ఎంపికయ్యారు. ఈనెల 11వ తేదీ వరకు జరిగే రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించాలని ఆమె సూచించారు.

News December 9, 2025

ఆచంటలో ఈనెల 10 జాబ్ మేళా..!

image

ఈనెల 10న ఆచంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో భాగంగా ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందన్నారు. ప్రముఖ కంపెనీల్లో 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వయసు, పదో తరగతి ఆపై చదివినవారు అర్హులన్నారు.