News April 28, 2024

ప.గో.: అప్పట్లో ప్రత్యర్థులు.. ఇప్పుడు దోస్తులు

image

తాడేపల్లిగూడెం YCP అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఇప్పటివరకు 6సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. ఇది 7వ సారి. అయితే గతంలో ప్రత్యర్థులుగా తనపై బరిలో నిలిచి గెలిచిన వ్యక్తులు ఇప్పుడు ఆయన గెలుపు కోసం కృషిచేయడం గమనార్హం. 1989లో తాడేపల్లిగూడెం MLAగా గెలుపొందిన పసల కనక సుందరరావు, 2009లో గెలుపొందిన ఈలి నాని అప్పట్లో ‘కొట్టు’కు ప్రత్యర్థులే. ఇప్పుడు వారిద్దరూ కొట్టుసత్యనారాయణ తరఫున ప్రచారం చేస్తున్నారు.

Similar News

News January 3, 2026

భీమవరం: గోదావరి క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

image

భీమవరంలో రెండురోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారని తెలిపారు.

News January 2, 2026

ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

image

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

News January 2, 2026

ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

image

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.